అశ్విని హాస్పిటల్ లో అరుదయిన ఆపరేషన్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదటి సరిగా జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. 24 వారాల గర్భవతి కి కవలలు కు మాయ ( placenta ) ఒకటి ఉండడం వలన ట్విన్ తో ట్విన్ ట్రాన్స్ఫయూషన్ అనే సమస్య వచ్చింది. ఈ సమస్యకు పిండానికి ఫిటోస్కోపీ పద్ధతి ద్వారా లేసర్ ఉపయోగించి సమస్య సరి చేయబడింది. ఈ ఆపరేషన్ లో పాండిచ్చేరికి చెందిన డా. మణికందన్, నగరానికి చెందిన ప్రముఖ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్లు డా. గాయత్రి ఇండ్ల, (లోటస్ స్కాన్స్), డా. స్ఫూర్తి పాల్గొన్నారు చికిత్స తరువాత తల్లి మరియు గర్భస్థ పిండాలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. గర్భస్థ పిండాలకు వచ్చే ఇటువంటి సమస్యలకు ఈ నూతన టెక్నాలజీ ద్వారా చికిత్స ఉందని అశ్విని హాస్పిటల్ Gynec విభాగాదిపతి డా. బి. ప్రమీల తెలిపారు.