హాలహర్వి దేశాయి చెరువుకు నీటిని మళ్లించి రైతులను రక్షించాలని వినతి
1 min read
ఎల్.ఎల్.సి ఏఈ కి వినతి పత్రం అందజేసిన మాజీ ఎల్.ఎల్.సి డైరెక్టర్ గడ్డం లక్ష్మి నారాయణ రెడ్డి
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: నందవరం మండల పరిధిలో. హాలహర్వి గ్రామానికి చెందిన రైతులం. హాలహర్వి గ్రామంలో గల దేశాయి చెరువు కింద దాదాపు 100 ఎకరాల వరిమడి సాగు చేసుకున్నాము. అయితే, ప్రస్తుతం చెరువులో నీటి లభ్యత లేదు.ఈ ఏడాది మిరప రైతులు తెగుళ్ల కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం హాలహర్వి గ్రామంలోని రైతులు దేశాయి చెరువు నీటిపై ఆధారపడిన పంటలను సాగు చేస్తున్నారు. కానీ నీటి లభ్యత లేకపోవడం వల్ల పంట ఎండిపోవడానికి నడుస్తోంది.అందువల్ల, మిరప సాగు దాదాపు పూర్తయిన దృష్ట్యా నీటి అవసరం తక్కువగా ఉంది. రైతులపై కనికరించి హాలహర్వి చెరువు కింద సాగు చేస్తున్న పంటలను రక్షించేందుకు వెంటనే చెరువుకు నీటిని మళ్లించవలసిందిగా మీకు మనవి.ఇది జరిగకపోతే, ఇప్పటికే ఎకరాకు రూ. 30,000 నుండి రూ. 35,000 వరకు ఖర్చు చేసిన రైతులు అప్పుల భారం మోయాల్సి వస్తుంది. ఇది వారి భూములను అమ్ముకునే పరిస్థితికి దారి తీస్తుంది. కాబట్టి, సంబంధిత ఎల్ ఎల్ సి అధికారులు ఈ సమస్యపై దయచేసి తక్షణ చర్యలు తీసుకుని హాలహర్వి చెరువుకు నీటిని మళ్లించాలి. తెలిపారు.