జడ్పిహెచ్ పాఠశాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కి వినతి
1 min read
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యల పరిష్కారానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు, మునిసిపల్ కమిషనర్ గంగిరెడ్డి కి వినతిపత్రం అందజేశారు వైయస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్, చేనేత జిల్లా అధ్యక్షులు వై.కె. శివ ప్రసాద్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 23-02-2025న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక భర్త, బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠప్ప పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ తమ బాధను వ్యక్తం చేశారని తెలిపారు.ఇటీవల కాలంలో పాఠశాల ప్రహరీకి ఆనుకుని ఉన్న బంకుల వద్ద అసాంఘిక శక్తులు గుంపులుగా చేరి, విద్యార్థినులను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతూ భయభ్రాంతులకు లోనవుతున్నారని, ఇలాంటి అనుచిత ఘటనలపై పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని తెలిపారు.విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత మునిసిపల్ అధికారులు, పోలీస్ శాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీని బలపరచడం, నిరంతర పోలీస్ గస్తీ ఏర్పాటు చేయడం, బంకుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సిపి నాయకులు బోయ సోమేశ్,గడ్డం అంజి,గరవయ్య మాభాష,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.