టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం
1 min read– జీ తెలుగులొ తెలుగు మీడియం ఐస్కూల్ అక్టోబర్ 8న సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లే అక్టోబర్ 9న ప్రారంభం!
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జీ తెలుగులో ఇదివరకెన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్ టెలివిజన్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తూనే కడుపుబ్బా నవ్వించేందుకు ‘తెలుగు మీడియం ఐస్కూల్’ అనే విభిన్నమైన నాన్ ఫిక్షపో షోతో మీ ముందుకు రాబోతోంది. అంతేకాదు, పుట్టుకతోనే కష్టాల పాలైన ఓ యువరాణి కథతో జాబిల్లికోసం ఆకాశమల్లె అనే సరికొత్త సీరియల్ని కూడా అందిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ముఖ్య అతిథిగా ప్రారంభం కానున్న తెలుగు మీడియం ఐస్కూల్ అక్టోబర్ 8 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, అదేవిధంగా జాబిల్లి కోసం ఆకాశమల్లె అక్టోబర్ 9 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు, మీ జీ తెలుగులో పారంభం కానున్నది.తెలుగు మీడియం ఐస్కూల్ షో ఒక వినూత్నమైన కాన్సెప్ట్ రాబోతోంది. ఇందులో ఎనిమిది మంది తెలుగు మెంటర్స్, తెలుగు భాషపై ఏమాత్రం అవగాహనలేని ఎనిమిది మంది విదేశీ పోటీదారులకు తెలుగు భాషను బోధించే కార్యక్రమం ఉంటుంది. ఎనర్జిటిక్ యాంకర్ రవి, పండు బాబాయ్, అబ్బాయిలుగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రారంభమయ్యే లాంచ్ ఎపిసోడ్ బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ సెన్సేషనల్ ఎంట్రీతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఆసక్తికర కథాంశంతో అద్భుతమైన నటీనటులతో రానున్న జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. హార్యంక రాజవంశం యువరాణిగా పుట్టి గూడెం లో పెరిగిన ఓ అమ్మాయి కథతో రూపొందుతున్న సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లె. పుట్టుకతోనే తండ్రికి దూరమై తన గుర్తింపును కోల్పోయిన యువరాణి జాబిల్లిని నారాయణమ్మ చేరదీసి పెంచుతుంది. తనను పెంచిన కుటుంబానికి కృతజ్ఞతగా ఉంటూనే తన పుట్టుక గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. జాబిల్లికి తన గతం ఏంటో తెలుస్తుందా? తెలియాలంటే ఈ సోమవారం నుంచి ప్రసారమయ్యే జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ తప్పకుండా చూడాల్సిందని సన్నీలియోన్ తెలిపారు.