ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత
1 min read– ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్ రాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ మోహన్ రాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదన్నారు. తన సొంత మండలమైన వీరబల్లిలో పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకోడం చాలా సంతోషదాయకమన్నారు.అదేవిధంగా పట్టభద్రులు,ఉపాధ్యాయులు తమ భవిష్యత్తు గురించి ఉక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీ డీ పీ అధ్యక్షులు బానుగోపాల్ రాజు,పట్టబధ్రులు,తదితరులు పాల్గొన్నారు.