PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘ఆర్ వై ఎస్ ఎస్’’  ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శీతాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో ఉండేవారే చలి తీవ్రతను తట్టుకోలేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. ఇదే చలికాలంలో  రోడ్లపై బిక్షాటన చేసేవారు, యాచకులు అవస్థలు మనం వర్ణించలేము. ఇలాంటి వారికి మేము సైతం ఉన్నామంటూ, కర్నూలు మండలం పి. రుద్రవరం గ్రామానికి చెందిన ఇ. విజయ్ కుమార్ గౌడ్ స్థాపించిన రుద్రవరం యువజన సేవా సమితి (ఆర్ వై ఎస్ ఎస్ ) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బుధవారం రాత్రి కర్నూలు నగరంలోని పలు ప్రధాన కూడల్లలో ఉన్న యాచకులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ వై ఎస్ ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి  సహకరించిన వారు  రవి శంకర్,పడిడెం మహేష్,కె.సత్యబాబు ,కె.నాగరాజు ,ఎం.నరేష్ బాబు ,ఆర్.ప్రణీత శ్రీ మేడమ్. ఎన్.శ్రీనివాస్ నాయక్ , కె.వెంకటకృష్ణ, ఇ విజయ్ కుమార్ గౌడ్ . ఈ సేవా కార్యక్రమానికి  సహకరించిన వారందరికి నా యొక్క పాధాభివదనం. మీరందరు ఈ లాగే మంచి మంచి సేవలు కార్యక్రమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నానని ఇ విజయ్ కుమార్ గౌడ్  తెలిపారు.

About Author