సముద్రంలో రెండు ముక్కలైన ఓడ !
1 min readపల్లెవెలుగువెబ్ : దక్షిణ చైనా సముద్రంలో ఓడ ధ్వంసమై మునిగిపోయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. ఈ నౌక హాకాంగ్కు నైరుతి దిశలో 296 కిలోమీటర్లు దూరంలో రెండుగా ముక్కలై మునిగిపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది గల్లంతైయ్యారని, ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన చాబా తుపాను కారణంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. హాంకాంగ్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.