ఉద్యోగులకు షాక్.. 23 శాతం మంది తొలగింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : సిలికాన్ వ్యాలీకి చెందిన ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ రాబిన్ హుడ్ 23 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. 23 శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపగా.. మూడునెలల ముందు 9శాతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాద్యంతో పాటు ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేడయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్ టెక్ కంపెనీ రాబిన్ హుడ్ 713 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 2,400మంది ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు ట్రెక్ క్రంచ్ నివేదించింది.