సీఎం పై ముద్దుల వర్షం !
1 min readపల్లెవెలుగు వెబ్: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పై ఓ మహిళ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. జనసేవక కార్యక్రమంలో భాగంగా సీఎం బొమ్మై బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందుకు వెళ్లారు. సీఎంను చూసిన సంతోషంలో ఓ మహిళ ఆయన కుడిచేతిని పట్టుకుని పదేపదే ముద్దులు పెట్టింది. ఆమె ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి అశ్వత్ నారాయణ ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదంటూ వారించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.