PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిశ్రమల స్ధాపనకు ‘ సింగిల్ డెస్క్ ‘ పోర్టల్

1 min read

– దరఖాస్తు చేస్తే 21 రోజుల లోపు అనుమతులు

– జగనన్న బడుగు వికాసం కింద ఎస్.సి. / ఎస్.టి.వారు ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ , ఎర్త్ మూవర్స్ , ఫంక్షన్ హాల్స్ కూడా 45 శాతం రాయితీ

– జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు పి. ఏసుదాసు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా యువత పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు పి. ఏసుదాసు చెప్పారు. జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు, పరిశ్రమల ద్వారా అమలు కాబడుతున్న పథకముల గురించి వివరించే నిమిత్తం మంగళవారం నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ( ఇ.డి.పి. ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ , ఎ.పి.ఎస్.ఎఫ్.సి. , డిప్యూటీ మేనేజర్ , పరిశ్రమల శాఖ అధికారులు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు . ఈ సందర్బంగా జిల్లా పరిశ్రమల కేంద్రం , జనరల్ మేనేజర్ పి.యేసుదాసు మాట్లాడుతూ పరిశ్రమలు నెలకొల్పదలచిన వారు ముందుగా తాము నెలకొల్పే పరిశ్రమపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు . తమకు అనుభవమున్న మరియు మార్కెట్ లో డిమాండ్ వున్న ఉత్పత్తులనే ఎంచుకోవాలన్నారు . ఉత్పత్తులు నాణ్యతగా ఉండేట్లు చూసుకోవాలన్నారు . పరిశ్రమల స్థాపనతో తాము ఉపాధి పొందడమే గాక మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు . పరిశ్రమల స్థాపనకు కావలసిన అనుమతుల కోసం ‘ సింగిల్ డెస్క్ ‘ పోర్టల్ లో దరఖాస్తు చేస్తే 21 రోజుల లోపు అనుమతులు లభిస్తాయన్నారు . క్రొత్తగా పరిశ్రమలు నెలకొల్పిన వారికి ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందన్నారు . ఐ.డి.పి. 2020-23 పారిశ్రామిక విధానం 31 మార్చి 2023 తో ముగుస్తుందన్నారు . ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఇ యూనిట్లు స్థాపించే జనరల్ కేటగిరీ వారికి 15 శాతం , బి.సి. మరియు మైనారిటీ మహిళలకు 35 శాతం , ఎస్.సి. మరియు ఎస్.టి. వారికి ప్రాజెక్టు వ్యయంలో 45 శాతం సబ్సిడీగా లభిస్తుందన్నారు . వై.ఎస్.ఆర్.జగనన్న బడుగు వికాసం ‘ పథకం క్రింద ఎస్.సి. / ఎస్.టి.వారు ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ , ఎర్త్ మూవర్స్ , ఫంక్షన్ హాల్స్ కూడా 45 శాతం రాయితీ లభిస్తుందన్నారు . ఒకే యాక్టివిటీ వున్న 10 మైక్రో లేదా స్మాల్ ఎంటర్ ప్రైజెస్ కలిసి క్లస్టర్లుగా ఏర్పడితే వాటికి కామన్ ఫెసిలిటీ సెంటర్ ( CFC ) కొరకు MSE – CDP స్కీము మైక్రో యూనిట్లకు 95 శాతం మరియు స్మాల్ యూనిట్లకు 90 శాతం రాయితీ లభిస్తుందన్నారు . ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధించినందువలన ఆ యూనిట్ల వారు క్లాత్ బ్యానర్ యూనిట్లను నెలకొల్పుటకు బ్యాంకులలో పి.యం.ఇ.జి.పి.స్కీము క్రింద దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు .జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తీసుకున్న ఋణాలను సక్రమంగా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తే వారి సిబిల్ రేటు పెరుగుతుందన్నారు . సిబిల్ రేటు 700 కు పైగా వున్న వారికి ఋణ సౌకర్యం సులభంగా లభిస్తుందన్నారు . ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన పథకం ద్వారా తయారీ రంగానికి రూ . 50 లక్షల వరకు , సేవా రంగానికి రూ .20 లక్షల వరకు ఋణం పొందవచ్చునన్నారు . అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు . ఆదాయ పరిమితి లేదన్నారు . పట్టణ పరిధిలో అయితే జనరల్ కేటగిరీ పురుషులకు ప్రాజెక్ట్ కాస్ట్ లో 15 శాతం మిగిలిన కేటగిరీల వారికి 25 శాతం అలాగే గ్రామీణ ప్రాంతంలో యూనిట్టు నెలకొల్పితే జనరల్ కేటగిరీ వారికి 25 శాతం , మిగతా కేటగిరీ వారికి 35 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు . గ్రామీణ ప్రాంతంలోని భూములను కూడా ల్యాండ్ కన్వర్షన్ అయి వుంటే సెక్యూరిటీ గా పరిగణిస్తామన్నారు .ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ( APSFC ) , ఏలూరు , డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంటర్ ప్రెన్యూర్ ఎంచుకున్న యాక్టివిటీకి సంబందించిన సంపూర్ణ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని తమను సంప్రదించాలన్నారు . ఎ.పి.ఎస్.ఎఫ్.సి. వారు అమలు చేసే స్కీముల గురించి వివరించారు . కొల్లేటరల్ సెక్యూరిటీ క్రింద వ్యవసాయ భూములను 50 శాతము వరకు అంగీకరిస్తామన్నారు . జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సుమధురవాణి మాట్లాడుతూ యూనిట్టుదారులకు తాము ఉత్పత్తి చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి సరియైన స్ట్రాటజీ అవసరమన్నారు . రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ , ప్లై యాష్ బ్రిక్స్ , మేంగో పల్స్ , అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ , బేకరీ మొదలైన యూనిట్లకు అవకాశాలున్నాయన్నారు . ఎం.పి.డి.ఓ. సుందరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పాలన్నారు . ఈ కార్యక్రమములో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నాగేంద్ర భూపాల్ పాల్గొన్నారు.

About Author