PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హంద్రీ నీవా కాలువపై స్లూయిజ్ ఏర్పాటు చేయాలి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గుండ్లకొండ దగ్గర హంద్రీనీవా కాలువపై  స్లూయిజ్ ఏర్పాటు చేసి, కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలని, అలాగే పంట కాలవలు  నిర్మించాలని కోరుతూ,శనివారం రైతు సంఘం నాయకులు డిఆర్ఓ, హెచ్ ఎం ఎస్ ఎస్. ఎస్ ఈ. లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, అధ్యక్షులు బి వీరశేఖర్, సహాయ కార్యదర్శి సూరి ఈ మేరకు అధికారులను కలిసి సాగునీటి అవసరాలపై వారికి వివరించారు. హంద్రనీవా కు గుండ్లకొండ దగ్గర స్లుయిజ్  ఏర్పాటు చేసి, కోటకొండ వరకు సాగు నీరు ఇవ్వాలని, అదేవిధంగా మండలంలోని చెరువుల న్నిటిని హంద్రీ నీవా నీటి తో నింపాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న పంట కాలువ నిర్మాణం వెంటనే చేపట్టాలని అన్నారు. రాయలసీమ కరువు విముక్తికి ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం చేపట్టారని,హంద్రీనీవా కాలువ ద్వారా వెనకబడిన కర్నూలు జిల్లాకు 82,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆయకట్టును  నిర్దేశించిందని తెలిపారు. అందులో బాగా వెనుకబడిన, మరే ఇతర సాగునీటి వనరులు లేని దేవనకొండ మండలంలో 42,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. హంద్రీనీవా మొదటి ఫేజ్ లో కర్నూలు జిల్లా ఉందని , పందికోన రిజర్వాయర్ నిర్మాణం చేయడం, రిజర్వాయర్ నుండి ప్రధాన కాలువలు పూర్తి చేశారు తప్ప పంట కాలువలు నిర్మాణం చేపట్టలేదని ,అందువలన నిర్దేశిత లక్ష్యం నెరవేరలేదని అన్నారు. కనుక హంద్రీనీవా క్రింద కర్నూలు జిల్లాలో దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి తదితర మండలాలలో పంట కాలువల నిర్మాణం తక్షణం చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు కేటాయించి నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నిత్యం కరువు కాటకలకు గురవుతున్న ఈ ప్రాంతాన్ని కరవురహితంగా చేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో హంద్రీ నీవా ద్వారా మండలంలోని ఎక్కువ గ్రామాలకు సాగునీటి  ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం వైపు నుండి చొరవ చూపాలని వారు సూచించారు. అదేవిధంగా హంద్రీనీవా ప్రధాన కాలువకు దేవనకొండ మండలంలో గుండ్ల కొండ వద్ద స్లూయిజ్ ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా గుండ్లకొండ నుండి కోట కొండ వరకు గుండ్ల కొండ, గుడిమిరాళ్ల, బంటు పల్లి, చెల్లెలి చెలిమిల, బేతపల్లి, బండపల్లి, వెంకటాపురం, పల్లె దొడ్డి, మాచాపురం వంటి 12 గ్రామాలలో 20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ,ఈ ప్రతిపాదన  ఇరిగేషన్ శాఖ ముందు, ప్రభుత్వం ముందు పెండింగులో వుందని చెప్పారు. అదేవిధంగా దేవనకొండ మండలంలోని హంద్రీనీవా కాలువ పనులు పాలకుర్తి నుండి తెర్నేకల్ వరకు అదేవిధంగా కప్పట్రాళ్ల దగ్గర హంద్రీ నీవా కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయనీ, గత కాంట్రాక్టర్ రాయి పడిందనే నెపంతో   పాలకుర్తి- తెర్నేకల్ గ్రామాల మధ్య కాలువ ను రెండు కిలోమీటర్ల మేర పెండింగ్లో పెట్టారని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న కాలువ తవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే మండలంలోని ఉన్నటువంటి చెరువులనన్నిటిని అందరినీవా కాలువ నుండి నీటిని నింపాలని వారు కోరారు.వెనకబడిన, నిత్యం కరువుకు గురవుతున్న కర్నూలు జిల్లా పంటపొలాలకు సాగునీరు అందించేందుకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు తిప్పన్న,మొట్టే ఆంజనేయులు, మాదాలమార్కండేయులు,మోదిన్ సాబ్, జయచంద్ర తదితరులుపాల్గొన్నారు.

About Author