తండ్రి జ్ఞాపకార్థం.. ప్రజలకు తాగు నీటి సౌకర్యం కల్పించిన తనయుడు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : సామాన్యంగా తల్లిదండ్రులను కొంత మంది కొడుకులు సరిగా చూసుకోక బయట పడేస్తుంటారు. మరికొందరు కొడుకులు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులను మరచి పోవడం చూస్తుంటారు. కానీ వీరి కి భిన్నంగా ఓ కొడుకు చనిపోయిన తండ్రి జ్ఞాపకార్థం తో గ్రామ ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేశాడు. వివరాల్లోకి వెళితే మంత్రాలయం మండలం వగరూరు గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో రెడ్డి దొర అనే వ్యక్తి సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది. అయితే రెడ్డి దొర కుమారుడు సయ్యద్ సాకీర్ సాబ్ తన తండ్రి రెడ్డి దొర తొలి వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలకు తాగునీరు అందించేందుకు స్వంత ఖర్చులతో బోరు వేసి నీళ్ల కుంబి కట్టి తాగునీరు సరఫరా చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గ్రామ ప్రజల సమక్షంలో తాగునీటి నీళ్ళ కుంబి ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంచి పని చేసిన సయ్యద్ సాకీర్ సాబ్ ను గ్రామస్తులు వీరే కొడుకులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ లతీఫ్ సాయబ్ ఖాద్రీ, తలాక్ సయ్యద్ సాయబ్ ఖాద్రీ, డీలర్ రఫీ, అబ్దుల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.