క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చెయ్యాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ప్రభుత్వాలు ఏవైనా సరే క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసి వారిని ఆర్థికంగా సహకారం అందించడానికి ప్రతేక నిధి ఏర్పాటు చెయ్యాలని ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రేడియం నూర్ తెలిపారు. ఈ సందర్భంగా రేడియం నూర్ మాట్లాడుతూ ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ తరపున వేసవిలో వాలీబాల్ శిక్షణ తీసుకున్న వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లో క్రీడాకారులకు GO.MS.NO.74 ప్రకారం 2 శాతం రిజర్వేషన్ కలదని ప్రతిఒక్కరూ చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నరు, క్రీడాకారుల కోసం నిత్యం పరితపిస్తున్న ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా కృషి మరువలేనిది అన్నారు, రానున్న రోజుల్లో క్రీడాకారుల కోసం ఆత్మకూరు పట్టణంలో అన్ని క్రీడలకు సంబందించిన క్రీడా పోటీలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా,కార్యదర్శి అసిఫ్ బెగ్, సీనియర్ క్రీడాకారులు సలాం బెగ్, షఫీ మరియు శిక్షణ తీసుకున్న క్రీడాకారులు పాల్గొన్నారు.