PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టం చేయాలి

1 min read

– ఏపీయూడబ్ల్యూజ డిమాండ్

– మీడియాపై దాడులను ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ధర్నా

– జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై చర్యలకోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు వినతిపత్రం

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:
 ఎలక్ట్రానిక్ అండ్ ప్రిట్ మీడియా  జర్నలిస్టులపై  వరుసగా జరుగుతున్న  దాడిఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్ ఎదుట ఏపీయూడబ్ల్యూజే ధర్నా నిర్వహించింది. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనదినం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను పెద్దఎత్తున నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం మీడియాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టం చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. మే 19 న కడప ఎంపి వై.ఎస్.  అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి  వస్తున్నారని తెలిసి రిపోర్టింగ్ కు వెళ్ళిన మీడియా సిబ్బందిలో  ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి , హెచ్.ఎం.టి.వి. రిపోర్టర్లపై , కెమెరా పర్సన్ లపై ఎంపీ అవినాష్ అనుచరులు అమానుషంగా  దాడిచేసి రిపోర్టర్లను తీవ్రంగా గాయపరచడం శోచనీయమన్నారు. అలాగే కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతోపాటు. వాహనాల అద్దాలనూ పగులగొట్టడం అమానుషం అన్నారు. విధినిర్వహణలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై, సిబ్బందిపై దాడిచేయడం పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఆయన అభివర్ణించారు. 
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో జర్నలిస్టులపై దాడీకి బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో పాత్రికేయులపై నానాటికీ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేకచట్టాన్ని తీసుకురావాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన సిఫార్సును  వెంటనే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  కోరుతున్నామన్నారు. వాట్సాప్ లో వచ్చిన  ఒక జీవో అనువాదంలో ఉన్న తప్పుగురించి  వివరణ కోరుతూ విజయనగరం  జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారికి మెసేజ్ పెట్టిన యూనియన్ రాష్ట్రకార్యదర్శి  విజయనగరం సీనియర్ పాత్రికేయుడు  పి.వి.వి.శివ ప్రసాదరావు సహా మరో ఇద్దరు జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్  సిఐడి శాఖ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన నిరసన ధర్నా అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు కలెక్టరేట్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు,  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచల జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి మాట్లాడుతూ కర్నూలులో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రివద్ద వార్తను కవర్ చేయడానికి వేచియున్న మీడియాపై దాడిని ఖండిస్తూ సంఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  విజయవాడ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్  వసంత్, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ హెచ్ రమణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా యూనియన్ నాయకులు యు. వెంకట్రావు,ఎం సైదేశ్వర్ రావు, విజయవాడ యూనియన్ నేతలు పి సురేంద్ర కుమార్, బీవీ శ్రీనివాసరావు, ఎంవీ సుబ్బారావు, జీ శ్రీనివాస కుమార్, ఆర్ రఘు, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ పి.మృత్యుంజయ కుమార్, ఎం మురళీకృష్ణ, సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ఏ సురేష్ బాబు, డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

About Author