బాలల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం
1 min read– న్యాయ సేవ సదన్ లో NALSA (పిల్లల స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి రక్షణ) పథకం, 2015 కింద పిల్లల ప్రయోజనం కోసం ప్రత్యేక కార్యక్రమము
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: న్యాయ సేవ సదన్ లో NALSA (పిల్లల స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి రక్షణ) పథకం, 2 0 1 5 కింద పిల్లల ప్రయోజనం కోసం విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ మరియు బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న NGOల అధికారులతో, వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు/బోధన సిబ్బంది తో ప్రత్యేక కార్యక్రమమును/సెన్సిటైజేషన్ సమావేశంను నిర్వహించాము. ఈ సమావేశములో i) మంచి స్పర్శ – Good Touchii) చెడు స్పర్శ – Bad Touchiii) స్నేహపూర్వక స్వభావం మరియు సోదరభావం – Friendly nature and brotherhood iv) దేశభక్తి – Patriotismఈ కార్యక్రమాలు పాఠశాలలు, సహవిద్యా సంస్థలు, బాలికల విద్యా మరియు బాలుర విద్యా సంస్థలలో ప్రత్యేక బృందాలుగా న్యాయవాదులు, జిల్లా విద్యా కార్యాలయ అధికారిక ప్రతినిధి, ఫ్యాకల్టీ సభ్యులు, PLVలు మొదలైనవారితో నిర్వహించబడతాయి.ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్‌డిపిఓ. కే.విజయ శేఖర్, జిల్లా విద్యాశాఖాధికారి వి. రంగా రెడ్డి, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం & సాధికారత అధికారి పి. వెంకటలక్ష్మి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.