పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…
1 min read32 ఏళ్ల తరువాత కలిసిన స్నేహబంధం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి మధుర జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు చేసే అల్లరి స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు వారితో కలిసి ఆడిన ఆటలు చిన్న చిన్న గ్యాంగ్‌లు అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ శనివారం 32 ఏళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. నందికొట్కూరు పట్టణంలోని స్థానిక సీఎస్ఐ బోర్డింగ్ పాఠశాల పూర్వ విద్యార్థులు 32 ఏళ్ళ తీపి జ్ఞాపకాలను స్థానిక సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 1981నుంచి1991 విద్యా సంవత్సరం నందికొట్కూరు సిఎస్ఐ జడ్పీ పాఠశాలలో విద్యను అభ్యసించిన నాటి పూర్వపు విద్యార్థులు 32 ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు.వాట్సప్ వేదికగా గత మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత గురువులు, పూర్వ విద్యార్థులు సతీష్ కుమార్, వేదవ్యాసులు, మల్లికార్జున్ రెడ్డి, వెంకటరమణ, సత్యం, రత్నాకర్, భాష, శ్రీధర్ రెడ్డి, అయ్యన్న, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.