PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్లమెంట్​లో… ‘ కోట్ల’ విగ్రహాన్ని ఆవిష్కరించాలి

1 min read

ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్​ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​: కోట్ల విజయ భాస్కర రెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించాలని  ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి   కోరారు. ఈ సందర్భంగా ఈరోజు పెద్దాయన 21 వ వర్ధంతి సందర్భంగా కర్నూలు లో కిసాన్ ఘాట్ లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించామని బిర్రు ప్రతాపరెడ్డి తెలుపుతూ అనంతరం  మీడియా  ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బిర్రు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ  బ్రిటీష్ వారి హాయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి త్రివర్ణ పతాకం ధరించి నిషేధాజ్ఞాల మధ్య సభను నిర్వహించిన ఆ నాటి విద్యార్థి నాయకుడే కోట్ల విజయ భాస్కర రెడ్డి. విద్యార్థి దశ నుంచి దేశ భక్తి, జాతీయ భావాలను అలవర్చుకున్న విజయ భాస్కర రెడ్డి  మాతృదేశాభిమానానికి సారధ్య సామర్ధ్యానికి ఇదొక మచ్చు తునక .1920 ఆగస్టు16 వ తేదీ న ఆయన జన్మించారు. ” పెద్దాయన” అనే గౌరవ వాచకం వినగానే కర్నూలు జిల్లాలోనే కాక యావత్ తెలుగు నాట విజయభాస్కర రెడ్డి గుర్తుకొస్తారు. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయాలలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న పెద్దాయన స్వాతంత్రోద్యమంలో మహాత్ముడు నిర్వహించిన ఉద్యమాలన్నింటిలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లారు. రైతుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసారు. సాగునీటి,త్రాగునీటి సౌకర్యాల కోసం ఎంతో కృషి చేసారు. రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా ,5 సార్లు శాసనసభ్యుడిగా,6 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఒక సారి శాసనమండలి సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రెండు సార్లు, అనేక పర్యాయాలు రాష్ట్ర మరియు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తూ మచ్చలేని మహానాయకునిగా ప్రశంశలు అందుకున్న నాయకుడు పెద్దాయన. రైతే శ్వాస ,ధ్యాసగా.. అన్న దాత సంక్షేమ కోసం ఎనలేని కృషి చేసి ఈ నాటి రైతుల గుండెల్లో ఆరని జ్యోతిగా వెలుగుతున్నారు.కావున అటువంటి మహనీయుని చరిత్రను భావి తరాలకు తెలిసే విధంగా,కలియుగం ఉన్నంత వరకు ఆయన నిజాయితీ సజీవంగా ఉండాలంటే పాఠ్యాంశాలలో వారి జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేస్తూ పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరడమైనది.ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు బి.వి సుబ్బా రెడ్డి, లక్కిరెడ్డి అమరసింహ రెడ్డి,తూముకుంట ప్రతాప్ రెడ్డి పల్లె శ్రీధర్ రెడ్డి, హేమలతా రెడ్డి,పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పులకుర్తి రంగారెడ్డి, రామిరెడ్డి,.ఇన్నెం రాజినీకాంత రెడ్డి,బైరెడ్డి రమేష్ రెడ్డి, తిమ్మా రెడ్డి,.మీనాక్షి రెడ్డి….తదితరులు పాల్గొన్నారు.

About Author