NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థిని

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి నూర్జహాన్ ఈ ఈ.ఎడ్యుకేషనల్ ఏపీఫణి. టెస్ట్ లో జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకును సాధించింది ప్రభుత్వ పాఠశాలల్లో ఏడవ తరగతి మరియు పదవ తరగతి చదివే విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ ఏపీ ఫణి అనే సంస్థ ప్రతి సంవత్సరం ఆన్లైన్ టెస్టును నిర్వహిస్తుంది. అందులో భాగంగా జనవరి 31 2022 నందు నిర్వహించిన టెస్టులో దాదాపుగా 51,000 మంది విద్యార్థులు పాల్గొనగా బనగానపల్లి మోడల్ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్న నూర్జహాన్ జిల్లాస్థాయిలో రెండవ ర్యాంకును సాధించగా ఈ విద్యార్థినికి నాలుగు వేల రూపాయల నగదు పారితోషికంతో పాటు షిల్డ్ ను విజయవాడ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రామలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ టెస్ట్ లో దాదాపుగా 51 వేల మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థిని జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని ఆమె నూర్జహాన్ కు అభినందనలు తెలిపారు. వారితోపాటు పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థినికి అభినందించారు.

About Author