శ్రీశైలంలో… దిగ్విజయంగా జరిగిన కురువంశ నిత్యాన్నదానం
1 min readశ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ,శ్రీశైలం
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: అఖిల జగత్తుకు నిరంతర లయ కారకులైన ఆ పరమేశ్వరుని సన్నిధానంలో, అఖిలాండశక్తి భ్రమరాంబికా దేవి అపూర్వ దైవశక్తులతో, సనాతన ధర్మానికి ఆలవాలమైన శ్రీశైలములోని అఖిలభారత కురువంశ నిత్య అన్నదాన సత్రంలో దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమము అతి పవిత్రమైన మహా శివరాత్రి పండుగ సందర్భంగా తేదీ :05-03-2024 నుండి 09-03-2024 వరకు పర్ల గ్రామ మల్లికార్జున,నీలన్న ,నాగయ్య ,చిన్నటేకూరు రాముడు సహకారంతో నిరంతరాయంగా అన్నదానం జరిగినది , కుల,మత, ప్రాంతభేదం లేకుండా కొన్ని వేలమంది శ్రీశైల యాత్రికులకు షడ్రుచులతో భోజన పంపిణీ కార్యక్రమం జరుగుచున్నది , అన్ని ప్రాంతాల కురువ కులస్తుల సహకారంతో, వస్తూ , ధన సహాయంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది, “ఓం నమశ్శివాయ ” పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ , ఓంకార నాదం మిన్ను ముట్టేలా ఆ పరమశివుడు సంతోషంతో విలయతాండవం చేసేలా, భ్రమరాంబికా దేవి హృదయానందం చెందేలా, భక్తులు తమ ముక్తకంఠంతో పలుకుతూ , వెల్లువల ముందుకు సాగుచున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కు అన్ని విధాల సహకరించిన ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ కులస్తులు అందరికీ, ధన్యవాదములు తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం .కే .రంగస్వామి ,ఉపాధ్యక్షులు రీనివాసులు ,కే .మహేష్ ,కోశాధికారి కే .వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు నాగశేషులు ,జి .శివన్న ,కే .బీరప్ప,కే .దేవేంద్ర , జిల్లా మహిళా అధ్యక్షురాలు టి .లీలమ్మ ,గణేష్ బుదురూ లక్ష్మన్న విశ్వనాథం ,పక్కీరప్ప తిప్పన్న ,వేల్పనూర్ శివ , తదితరులు పాల్గొన్నారు .