PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

1 min read

పల్లె వెలుగు , వెబ్​ మహానంది : మహానంది లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ట్రైనింగ్ డి టి డబ్ల్యూ వెంకట శివ ప్రసాద్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు .పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతుల పై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది .డైలీ వేజెస్ కింద పని చేసే ఉద్యోగులు ఎందుకు రావడం లేదని హెచ్ఎం ను ప్రశ్నించారు .రెండు సంవత్సరాలుగా జీతాలు రావడంలేదని అందుకే వారం నుంచి వారు విధులకు దూరంగా ఉన్నారని పేర్కొన్నట్లు సమాచారం .వారికి త్వరలో జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని రేపటినుండి విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశించినట్లు సమాచారం .మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేకపోవడం పై ప్రశ్నించినట్లు తెలుస్తుంది .విద్యార్థులకు పడుకునేందుకు సరైన వసతులు లేవని తరగతి గదుల్లోనే రాత్రి నిద్రిస్తున్న ట్లు విద్యార్థులు పేర్కొన్నట్లు సమాచారం .డార్మెటరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు హెచ్ ఎం అమ్మ0బపేర్కొన్నట్లు సమాచారం .విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం మరియు భోజనం తదితర అంశాలపై విద్యార్థులతో చర్చించడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందజేయాలని ఆదేశించినట్టు తెలిసింది.విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించేందుకు ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం ఏమిటి అని ప్రశ్నించినట్లు సమాచారం .వెంటనే మరమ్మతులు చేయించాలని పేర్కొనట్లు తెలుస్తుంది .గిరిజన ఆశ్రమ పాఠశాలలో నీ విద్యుత్ మోటార్ చెడిపోవడంతో మరమ్మతు చేయించామని ఆర్ఓ ప్లాంట్ కూడా మరమ్మతులు చేయించి విద్యార్థులకు తాగునీరు ఏర్పాటు చేస్తామని హెచ్ఎం పేర్కొనట్లు తెలుస్తుంది .విద్యార్థుల హాజర్ మరియు ఉపాధ్యాయుల హాజరు తో పాటు వారి పనితీరు పై ఆరా తీసినట్లు సమాచారం .

About Author