PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్యాగాలకు ప్రతీక..బక్రీద్​: టీజీ భరత్​

1 min read

బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న టిజి భరత్

పల్లెవెలుగు:త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్​ పండగను ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​. గురువారం బక్రీద్​ పండగ సందర్భంగా   నగరంలోని పాత ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల చేశారు.  ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బాధలు, త్యాగాలు స్మరించుకుంటూనే ఎన్ని కష్టాలు ఎదురైనా జయించుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు టిజి భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

About Author