600 మందికి ఒక టీచరా ?
1 min readపల్లెవెలుగువెబ్ : పాఠశాల విద్యాశాఖ జారీచేసిన రేషనలైజేషన్ జీవోలు అసంబద్ధంగా ఉన్నాయని, 600మంది విద్యార్థులకు ఒక హిందీ టీచర్ బోధన ఎలా అందిస్తాడని హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వనిమిరెడ్డి విజయకుమార్, మేడికొండ సదానందబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 17 సెక్షన్లకు ఒక హిందీ ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం 2017లో ప్రతి 250 మంది విద్యార్థులకు ఒక హిందీ ఉపాధ్యాయుడు ఉండాలని ఉత్తర్వులు జారీ చేయగా ఇప్పుడు మాత్రం ప్రతి 600 మందికి ఒక హిందీ ఉపాధ్యాయుడు ఉండేలా రేషనలైజేషన్ ఉత్తర్వులు ఉన్నాయని దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వెంటనే జీవో నం 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.