ఎద్దుకు ఆలయం !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూ మతంలో వృషభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదేవుడు ఈశ్వరుడి వాహనంగా గుర్తింపు పొందింది. అంతే కాకుండా మానవులకు ఎద్దు రూపంలో కీలకంగా మారింది. తిరుప్పూర్ జిల్లా సేనాపతిపాళయానికి చెందిన రైతు సోమసుందరం 18 సంవత్సరాలు ఎద్దును పోషిస్తున్నాడు. కుటుంబంలో ఓ సభ్యుడిగా ఆయన అభిమానించాడు. వృద్ధాప్యం కారణంగా 10, సెప్టెంబరు 2018లో అది మృతి చెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ఎద్దును తన పొలంలోనే అంత్యక్రియలు చేసి అక్కడ ఓ ఆలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు.