పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి
1 min read
ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పి.జీవన్ కుమార్ డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ పాస్టర్ పి.జీవన్ కుమార్ డిమాండ్ చేశారు.ఏలూరులోని సత్రంపాడులో గల గెట్సేమనే సెంట్రల్ చర్చిలో పాస్టర్ అసోసియేషన్ వారు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ యావత్ భారతదేశనికి దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రవీణ్ ప్రగడాల మృతి చాలా బాధాకరమని అన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే మార్గంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల హైవేపై రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు. గత నెల రోజుల క్రితం ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, చెప్పిన నెలరోజులకే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. అదేవిధంగా ఆయన హెల్మెట్ పెట్టుకొని ఉన్నా సరే మొఖంపై బలమైన గాయం ఎలా తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నామన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి పై సమగ్ర విచారణ జరిపించి వారి కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిక్కాల జోసెఫ్, సభ్యులు పీటర్, పాస్టర్ కిరణ్ పాల్, ఏలూరు సిటీ పాస్టర్స్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.