అమరజీవి కామ్రేడ్ చదువుల రామయ్యకు నివాళి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పూర్వపు ఉమ్మడి జిల్లా కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ చదువుల రామయ్య 32 వ వర్ధంతి సిపిఐ కార్యాలయంలో ఆయనకు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్రయ్య,పంపన గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ తెలిపారు .అనంతరం వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి చదువుల రామయ్య అన్నారు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక అనేక ప్రాంతాలలో దున్నేవాడిదే భూమి అంటూ భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిన ఘన చరిత్ర వారిది అని వారు తెలిపారు. ప్రధానంగా ఎమ్మిగనూరు, మంత్రాల నియోజకవర్గాలలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి విస్తృతంగా గ్రామ గ్రామాన పర్యటించి కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారని, ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలలో పెత్తందారు చేతిలో నలిగిపోతున్న గ్రామాలకు మరియు ప్రజలకు అండగా నిలబడి అనేక పోరాటాలు నడిపిన చరిత్ర చదలో రామయ్యకే దక్కిందని వారు తెలిపారు. చదువు కామ్రేడ్ చదువుల రామయ్య నాయకత్వంలో కామ్రేడ్ బిజీ మాదన్న పార్టీని విస్తృతంగా ఏర్పరచడంలో ఎనలేని కృషి చేశారని వారు తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చి పట్టాలు ఇప్పిచ్చి ఎంతోమందికి జీవితాలను కల్పించినటువంటి మహానీయులు అన్నారు. అప్పటి హత్య రాజకీయాలకు భయపడకుండగా పార్టీ బలోపేతం కోసం ఆయన చాలా కృషి చేశారు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నాయకులు కార్యక్రమం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ ప్రజాసంఘ నాయకులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజాసంఘాల నాయకులు చిన్నన్న కేసి జబ్బర్, బజారి,విజయేంద్ర,తిమ్మ గురుడు,వీరేష్, సుంకన్న, నరసింహులు,తదితరులు పాల్గొన్నారు.