పాస్టర్ పగడాల ప్రవీణ్ కి ఘనంగా శ్రద్ధాంజలి
1 min read
నేషనల్ దళిత జేఏసీ నాయకులు
ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్ పై అనేక అనుమానాలు
నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు
మే 3వ తేదీన జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున ధర్నా
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: న్యూఢిల్లీ లో ఏపీ భవన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టాట్యూ వద్ద నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు ఢిల్లీ తెలుగు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. పగడాల ప్రవీణ్ మృతిపై పోస్టుమార్టం రిపోర్ట్ పై అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని తేటతెల్లం చేసే ప్రజలకు తెలిపే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి ప్రభుత్వానికి ఉందని పెరికె వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని క్రైస్తవ ఆస్తులు కాపాడాలని దళిత క్రైస్తవులను దళిత ముస్లింలను ఎస్సీలుగా గుర్తించాలని 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా ఇచ్చారని 1990లో బౌద్ధమతం తీసుకున్న దళితులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గౌరవార్ధం ఎస్సి హోదా కల్పించారని, అదేవిధంగా క్రైస్తవ మతంలో ని దళితులకు ఎస్సీ హోదా కల్పించి రాయితీలు ఇవ్వాలని రిజర్వేషన్స్ లేక దళిత క్రైస్తవులు అభివృద్ధి కుంటుబడి నిరుపేదలుగా మారుతున్నారని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె ఆవేదన వ్యక్తం చేశారు దళిత క్రైస్తవులకు రాజ్యాంగం పరంగా ఉన్న హక్కులు కల్పించాలని ప్రభుత్వాలు దళితులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని కోరారు. దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించే రంగనాథ్ మిశ్రా కమిషన్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంలో మే మూడవ తారీఖున శనివారం న్యూఢిల్లీ 03.05.2025 జంతర్మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ భాస్కరరావు పాస్టర్ రవికుమార్ బిజీ రావు పాస్టర్ అరుణ కుమార్ పాస్టర్ ఎం కొండయ్య పాస్టర్ జోయల్ పాస్టర్ ఎలీషా పాస్టర్ శామ్యూల్ పాస్టర్ శ్రీనివాస్ లు పాల్గొని ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు.