NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాతకు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: నంద్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహానంది క్షేత్రంలో అమలవుతున్న అన్న ప్రసాదా వితరణ కార్యక్రమానికి ప్రతినిత్యం కూరగాయలు పంపిణీ చేస్తున్న దాత లక్క బోయిన ప్రసాద్ ను సన్మానించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతినిత్యం ప్రతిరోజు మహానంది క్షేత్రానికి అవసరం అయ్యే కూరగాయలతో పాటు క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాలకు విశిష్ట దాతగా పేరు పొందినట్లు సన్మానం సందర్భంగా పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. దీంతోపాటు శ్రీకాళహస్తి ఆలయానికి కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కావాల్సినన్ని కూరగాయలను టన్నులకొద్దీ ఉచితంగా పంపిణీ చేస్తున్న ఘనత ప్రసాద్ దంపతులకు దక్కుతుంది అన్నారు. ఆస్తులు ఐశ్వర్యం ఉన్న దాన గుణం ఉన్నవారు కొందరేదన్నారు. ఈ కార్యక్రమంలో పి డి జి రామలింగారెడ్డి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అనిల్ కుమార్ ఎం సి మోహన్ రెడ్డి ఎస్ నాగరాజు రావు తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సన్మానించారు.

About Author