వేల్పనూరులో అపూర్వ విద్యార్థుల సమ్మేళనం
1 min read
పూర్వ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
వెలుగోడు, న్యూస నేడు : 25 ఏళ్ల కిందట పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో కలుసుకొని వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు ఆనాటి విద్యార్థులు.నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలోని వేల్పనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో చదివిన పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వపు ఉపాధ్యాయులు రఘునాథరెడ్డి,బసిరెడ్డి,కే.శేష శయాన శర్మ,రఫిక్ అహ్మద్,అబ్దుల్ ఖాదర్, అబ్దుల్,ఫిజికల్ డైరెక్టర్ శంకర్ లను ఘనంగా శాలువాలతో సత్కరిస్తూ మేమేంటోలను ఆనాటి విద్యార్థులు అందజేశారు.ఆనాడు చదివిన పాఠశాలలో చిన్ననాటి జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులు ఒకరికొకరు నెమరు వేసుకున్నారు. ఆనాడు ఉపాధ్యాయులు మాకు చక్కటి విద్యా బోధన మరియు చక్కటి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు మమ్మల్ని ముందుకు నడిపించడంతోనే మేము మంచిగా చదువుకొని ఒక స్థానంలో ఉన్నామని విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల కుటుంబ సమేతంగా సమ్మేళనానికి హాజరయ్యారు.కుటుంబ స్థితిగతుల గురించి విద్యార్థులు తెలియజేశారు. మీరు మంచిగా చదువుకున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులను మీరు గౌరవిస్తూ వారిని ఆదరించాలని ఉపాధ్యాయులు విద్యార్థులతో అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీను, శ్రీకాంత్ రెడ్డి,నూరుల్లా,మా భాష,పరమేష్,వెంకటేష్,సుబ్బయ్య స్వాములు,సూరి,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
