PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా ఐక్య క్రిస్మస్ వేడుక

1 min read

పూల వర్షంతో ఎమ్మెల్యే ఆర్థర్ కు ఘన స్వాగతం

 వితంతువులు పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పల దడియ గ్రామంలో ఉన్న ఆర్ సి ఎం చర్చి(పునీత యోహాను దేవాలయంలో)లో ఐక్య క్రిస్మస్ వేడుకలు విచారణ గురువులు డి.మధుబాబు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అంగరంగ వై భవంగా జరిగాయి.చర్చి ఆవరణంలో నూతనంగా నిర్మించిన మేరీమాత మరియు తిరు కుటుంబం దగ్గర ఎమ్మెల్యే టెంకాయలు కొడుతూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అత్యంత అద్భుతంగా తయారు చేసిన దావీదు పట్టణం ను ఎమ్మెల్యే సందర్శించారు.తర్వాత విచారణ గురువు మధు బాబు దివ్య బలిపూజను సమర్పించారు.పూలవర్షంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం: ఈ వేడుకలకు సాయంత్రం 6 గంటలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ కు విచారణ గురువుల మధుబాబు విచారణ పెద్దలు పూల బోకే అందజేస్తూ విచారణ సంఘ ప్రజలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.విచారణలో ఉన్న 10 గ్రామాలు అయిన ఉప్పలదడియ కలమంద లపాడు,మాసపేట, దిగువపాడు,కేతవరం, కడుమూరు,పైపాలెం,49 బన్నూరు,చౌటుకూరు, దేవనూరు గ్రామాల ప్రజలు పూలు ఎమ్మెల్యేపై వెద జల్లుతూ మేల తాళాలు నడుమ టపాకాయలు కాలుస్తూ స్వాగతం పలికారు.వితంతువులు పేదలకు దుప్పట్లు ప్రధానం చేసిన ఎమ్మెల్యేపది గ్రామాల్లో ఉన్న 150 మంది వితంతువులు మరియు పేద మహిళలకు దుప్పట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అదే విధంగా ఐక్య క్రిస్మస్(సెమీ క్రిస్మస్)సందర్భంగా ముందుగా నిర్వహించిన క్రికెట్ వాలీబాల్ తదితర ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే మరియు ప్రజా ప్రతినిధులు నాయకులు ట్రోఫీలను అందజేశారు.బాలయేసు పశువుల పాకలో జన్మించడం ఎంతో ధన్యత ఐక్య క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ బాల యేసు పశువుల పాకలో జన్మించడం మనకు ఎంతో ధన్యమని అంతే కాకుండా ఆయన లోక రక్షకుడు తనకు తాను తగ్గించుకొని పశువుల పాకను ఆయన ఎంచుకొని బాల యేసు అక్కడ జన్మించాడని అదే విధంగా మనము కూడా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు. అదేవిధంగా నాకు ఏమైనా సమస్యలు వస్తూ ఉంటే నేను ఎప్పుడూ కూడా వేలంగినికి వేలాంగిణికి వెళ్లి అక్కడ నేను ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల నాకు ఉన్న ఎన్నో సమస్యలను దేవుడు దూరం చేశారని పిల్లలను తల్లిదండ్రులు మంచిగా చదివిస్తూ వారికి పునాది బాట వేయాలని ఆయన తల్లిదండ్రులను కోరారు.

అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు

పది గ్రామాల్లో ఉన్న చిన్నారులు మంచి దుస్తులతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా అందరినీ అలరించాయి. సాయంత్రం 6 గంటల నుండి 10:15 నిమిషాల వరకు ఎమ్మెల్యే అక్కడే ఎంతో ఓపికగా ఉంటూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.చిట్ట చివరగా ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులకు మరియు నాయకులకు శాలు వాలతో ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో బ్రదర్లు థామస్,మరియ రాజ్,జగదీష్,గ్రామ సర్పంచ్ అన్వర్ భాష,వంగూరు జనార్దన్ రెడ్డి,కమతం వీరారెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి,నందికొట్కూరు కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి, ఎస్ఐ జగన్ మోహన్,ఏఎస్ఐ సుబ్బయ్య,ఇ నాయతుల్ల,పుల్లయ్య, విచారణ పెద్దలు మరియు 10 గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author