ఆసుపత్రికి వెళ్లి పింఛన్ అందజేసిన వాలంటీర్
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతినెలా మొదటి రెండవ తేదీ లోపే పింఛన్లను వారి ఇంటి తలుపు తట్టి పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు అంతేకాదు పించన్ దారులు ఇంటిదగ్గర లేని వారికి ఒకవేళ అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఉంటే వారు ఉన్న ఆసుపత్రి దగ్గరికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటరీలు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన దండగుల వెంకటేశ్వరమ్మకు గత ఎనిమిది నెలల కిందట భర్త వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.వితంతు పింఛను తీసుకుంటున్న వెంకటేశ్వరమ్మకు ఆరోగ్యం బాగా లేనందున గత వారం నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈమెకు పింఛన్ ను వెంటనే అందించాలనే తలపుతో ఈ విషయం తెలుసుకున్న వాలంటీర్ కుంచపు శ్రీరాములు ఆసుపత్రికి వెళ్లి ఆమెకు పింఛను అందజేశారు. ఆసుపత్రికి వచ్చి పింఛన్ అందించినందుకు గాను వాలంటీర్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.