పారుమంచాలలో బిషప్ జ్వాన్నేష్ కు ఘన స్వాగతం..
1 min read
50 సం.ల గోల్డెన్ జూబ్లీకి హాజరైన బిషప్..
పల్లెవెలుగు, నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామంలో ఆర్.సీ.యం బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామానికి చెందిన మాధవరం థెరేసమ్మ సిస్టర్ అయ్యి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ హాజరయ్యారు.జూపాడుబంగ్లా విచారణ గురువులు ఎల్ బాలయేసు మరియు సంఘస్తుల ఆధ్వర్యంలో గ్రామంలోని బస్టాండ్ ప్రాంగణం నుంచి మేళ తాళాల మరియు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.తర్వాత దేవాలయంలో దివ్య బలిపూజను బిషప్ సమర్పించి దివ్య ప్రసాద అప్పమును సంఘస్థులకు అందజేశారు.దేవుని అడుగుజాడల్లో నడిచే విధంగా ఉండాలని ఇతరులకు మనం సహాయపడే విధంగా ఉండాలని వాక్య పరిచర్య చేశారు.ఈ కార్యక్రమంలో గురువులు దేవదాసు,ప్రవీణ్, మధుబాబు,ఇన్నారెడ్డి, భాస్కర్ తోట జోసెఫ్ మనోజ్ సందీప్,బ్రదర్ థోమాస్ తదితర గురువులు కన్యా స్త్రీలు ఉపదేశి బాలరాజు మరియు సంఘస్తులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

