వజ్రాల వేటకు వెళ్లే వారికి కర్నూలు రైతుల హెచ్చరిక
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ప్రతి ఏడాది వజ్రాల వేట సాగుతుంది. వర్షాలు పడటం ప్రారంభం కాగానే.. చాలా మంది పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెతుకుతుంటారు. అయితే గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు.. తుగ్గలి మండలంలోని జొన్నగిరిలోని పొలాల్లో ప్రజలు వజ్రాల వేట మొదలుపెట్టారు. వజ్రాల వేటకు వచ్చేవారికి రైతులు హెచ్చరిక బోర్డుపెట్టారు. ఇష్టం వచ్చినట్టు వజ్రాల వేట చేస్తాం అంటే ఊరుకునేది లేదు అంటూ.. ఆ హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి.