PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో ట్రాలీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్ల చేరిక సందర్భంగా సిఐటియు జెండా ఆటో& ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ ) జిల్లా కార్యదర్శి డి. లక్ష్మణ్, ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వెన్న బాల వెంకట్ లతోపాటు రామకృష్ణ, షేక్ బాబు, శివుడు, అస్లాం భాష, స్వామన్న, ప్రభాకర్, నారాయణ, శ్రీరాములు, పెద్దన్న, నారాయణ, సుబ్బారావు, బాలు లు పాల్గొన్నారు. అనంతరం ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిఐటియు డి లక్ష్మణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి వెన్న బాల వెంకట్లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం రవాణారంగం పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ముఖ్యంగా ఆటో ట్రాలీ డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని రోడ్డు రవాణా రంగం భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు అదుపు చేయాలని, రోడ్ల నూతనంగా నిర్మాణం ప్రతి గ్రామానికి ఏర్పాటు చేయాలని అన్నారు. నిత్యం ప్రజలకు సేవ చేస్తూ వారి ఆరోగ్యం బాగా లేని సందర్భంలో అర్థరాత్రి అయినా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లి బాగా అయ్యేంతవరకు తన కుటుంబానికి అండగా నిలబడే నిజమైన సేవకుడు ఆటో అండ్ ట్రాలీ డ్రైవరేనని నేడున్న పరిస్థితులలో ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా వారి ఇంటి అవసరాల కోసం ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్లే ఉపయోగపడుతున్నారని వీరిపైన పోలీసు, ఆర్టీవో అధికారులు దాడులు ఎక్కువయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు టాక్స్ ల పేరుతో మోయలేని భారాలు వేయడం జరుగుతుందని రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న బారాలకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లతో ఐక్యంగా ముందుకు కదిలి పోరాటాలకు సిద్ధం కావాలని, డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు కోసం ప్రభుత్వం కృషి చేయకపోతే పోరాటాన్ని ఉదృతం చేసేందుకు సిఐటియు ముందు బాగా నిలబడుతుందని అన్నారు.

About Author