పెయింటింగ్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
1 min read– ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పెయింటింగ్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్.కృష్ణయ్య, సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ లు డిమాండ్ చేశారు. ఆదివారం షాదిఖానలో పెయింటింగ్ వర్కర్ల సమావేశం ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు నెట్టికంటయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెయింటింగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రమాద బీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక:- పత్తికొండ పట్టణ పెయింటింగ్ వర్కర్ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పెయింటింగ్ వర్కర్ల పత్తికొండ పట్టణ గౌరవ అధ్యక్షులుగా నెట్టి, అధ్యక్షులుగా ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా రంగస్వామి, రామాంజనేయులు, బాలరాజు, రంగన్న, ప్రధాన కార్యదర్శిగా తిమ్మన్న, సహాయ కార్యదర్శులుగా సూరి, సద్దాం, మారుతి, నాగ శేషు, కోశాధికారిగా బాలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి తాలూకా కార్యదర్శి రంగన్న, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కారన్న, పెద్ద ఈరన్న, ఏఐటీయూసీ నాయకులు గుండు భాష, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.