ఇంటింటా సంక్షేమ బావుటా
1 min read– అన్ని వర్గాల ప్రజల నోట జగనన్న మాట..
– జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు.
– గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్ఏ ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. గురువారం నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం పరిధిలో రెండో రోజు గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులుతో కలసి ఎమ్మెల్యే ఆర్థర్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటా పర్యటించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్న విషయాలను ప్రజలతో నేరుగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రధానమైన అంశాలలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి ,వైయస్సార్ చేయూత, పెన్షన్ పెంపు ,ఫీజు రియంబర్స్మెంట్ , యువతకు ఉపాధి, వైయస్సార్ ఆసరా, మైనారిటీ, బీసీ సంక్షేమం నాయి బ్రాహ్మణులు, టైలర్లు రజకులకు ఆర్థిక సహాయం, చేయూత, చేనేత కార్మికులకు సంక్షేమం వంటి కార్యక్రమాలు ఆయా లబ్ధిదారులకు చెందుతూ అంశాలను ఇంటింటా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు చేరలేదని తమ దృష్టికి వస్తే వెంటనే స్థానిక అధికారులతో చర్చించి వెంటనే వచ్చే విధంగా ఏర్పాటు చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టాడని చెప్పారు. అభివృద్ధిలో చాలా ముందు ఉన్నామన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతానికిపైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ఎమ్మెల్యేఆర్థర్ స్పష్టం చేశారు. పండుగ వాతావరణంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
జగనన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన అక్కచెల్లెమ్మలు..
ఎంఎల్ఏ తొగురు ఆర్థర్ పాల్గొంటున్న గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటా మహిళల నుంచి ఆత్మీయ స్వాగతాలు లభిస్తున్నాయి.జగన్ ప్రభుత్వం అందచేస్తున్న పథకాలును వారే ఎంఎల్ఏ కు తెలుపుతూ , ఈ పథకాలుతో తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ప్రతిఅంశంలోనూ పెద్దపీట వేస్తున్నారని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని, పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలుకు బాసటగా నిలిచేందుకు వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నావడ్డీ, బ్యాంకు లింకేజీ తదితరపథకాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటూ మహిళలు ఎమ్మెల్యే కు వివరించారు. మహిళల సంక్షేమానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ బీమా, చేదోడు, ఆమ్మఒడి ప్రతి పథకం ఎవ్వరి సిపారసు లేకుండానే నేరుగా తమ బ్యాంకు ఖాతాలలోకి నగదును జమ అవుచుండం గొప్పవిషయమని అక్కచెల్లెమ్మలు తెలిపారు.మహిళలకు రక్షణ కవచంగా దిశ చట్టాన్ని చేశారని,మహిళల భద్రత, సంక్షేమం కోసం సీఎం జగన్ కృషిచేయడం అభినంద నీయమని జగనన్న మేలు మరువలేమంటూ , సీఎం జగన్ చాలా మంచి వారంటూ ఎమ్మెల్యే ఎదుట మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ సుకూర్ .డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ శోభారాణి, మండల వ్యవసాయ అధికారి శ్రావణి , విద్యాధికారి ఫైజున్నిసా బేగం , పంచాయతీ రాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డి, ఆర్డబ్ల్యూ ఏఈ వేణు మాధురి, ఐసీడీస్ సూపర్ వైజర్ ఆశ్వీరోదమ్మ , విద్యుత్ శాఖ ఏఈ రాములు నాయక్ , గ్రామ వైసీపీ నాయకులు శంకరయ్య , అంజిబాబు , కృష్ణ, చిన్న మౌలాలి స్వామి, నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల ఉసేనయ్య , శాతనకోట వెంకటేశ్వర్లు, బిజినవేముల మహేష్, కోళ్ల బావాపురం వెంకటేశ్వర్లు, బోరెల్లి.రఘు, మండల అధికారులు వైసిపి నాయకులు,పాల్గొన్నారు.