వీపనగండ్లలో వాహనం ఢీకొని మహిళ మృతి..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రామిరెడ్డి మాధవ రెడ్డి భార్య మహేశ్వరమ్మ (48) గురువారం మధ్యాహ్నం 3:30 కు నందికొట్కూరు రహదారిలో గ్రామ ఊరి బయట పొలం పనుల నిమిత్తం పొలం దగ్గరికి రోడ్డు మార్గాన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయం తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.ఈమెకు కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డి,కూతురు మనీషా ఉన్నారు.కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.