అకాడమిక్ విషయాలపై వర్క్ షాప్ నిర్వహించాలి.. ఆపస్ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : విద్యారంగంలోని అకాడమిక్ విషయాలపై దృష్టి సారించాలని అకడమిక్ విషయాలపై ఉపాధ్యాయ సంఘాలతో వర్క్ షాప్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. శ్రావణ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీ లు కోరారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిశ్రీ జవహర్ రెడ్డి గారిని కలిసివిద్యారంగంలో అంశాలపై దృష్టి సారించాలని, ఉన్నత పాటశాలలలో 1: 40 నిష్పత్తిలో ఉపాధ్యాయ విద్యార్థుల సంఖ్య ఉండాలని పరిమితికి మించి ఉండిన మూల్యాంకనము విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడం సాధ్యం కాదని, దానికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టాలని వారు కోరారు. ప్రతి ఉపాధ్యాయునికి వారానికి 32 పీరియడ్స్ మించరాదని, ఇప్పుడు వర్క్ లోడ్ చూస్తుంటే ఒక్కొక్కరికి 40 పీరియడ్లు బోధన చేయాల్సి వస్తుందని వారన్నారు. దానిని సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు సంఖ్య తో సంబందం లేకుండా ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు పోస్టులు ఉండాలని వారు కోరారు.