పెళ్లి కాలేదని యువకుడు ఆత్మహత్య
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో కురువ నాగార్జున(25)పెళ్లి కాలేదని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది.ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కురువ చిన్నయ్య,రవణమ్మల కుమారుడు కురువ.నాగార్జునకు మతిస్థిమితం లేదని అంతే కాకుండా పెళ్లి కాలేదని జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి అందరితో బాగానే మాట్లాడాడని ఇంట్లో భోజనం చేశాడని అందరూ నిద్రించిన తర్వాత శనివారం ఉదయం ఇంట్లోకి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా గవాసి కడ్డీలకు నాగార్జున తాడుతో ఉరి వేసుకున్నాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్ఐ సుబ్బయ్య అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.మృతుని తండ్రి గతంలోనే మరణించాడు.మృతుని తండ్రి రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు.