PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం కోక్కరాయిపల్లి గ్రామానికి గ్రామానికి చెందిన పాలూరు శ్రీనివాసులు (36) కుటుంబ కలహాలు, ఒంటరితనం భరించలేక మద్యం మత్తులో బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మృతుడు శ్రీనివాసులు కు వివాహం కాగా మొదటి భార్య కు విడాకులు ఇచ్చి రెండవసారి తన అక్క కూతురు నీ వివాహం చేసుకోవడం జరిగిందన్నారు, అయితే రెండవ భార్య మతిస్థిమితం సక్రమంగా ఉండకపోవడంతో, ఒకపక్క కుటుంబ సమస్యలు- ఒంటరితనం వెరసి శ్రీనివాసులు మద్యం మత్తులో ఇంట్లో ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

About Author