NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనుమానాస్పద స్థితిలో బావిలో పడి యువకుడు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ జూపాడుబంగ్లా: మండల కేంద్రం జూపాడుబంగ్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నాగేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం భోజనం అనంతరం బయటికి వెళ్లిన విద్యార్థి పాఠశాలకు రాకపోవడంతో ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు శనివారం గ్రామానికి చెందిన నాగేష్ తల్లిదండ్రులు రామకృష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సాయంత్రం గురుకుల పాఠశాల అవతలి వైపు ప్రతాపరెడ్డి అనే రైతుకు చెందిన బావిలో మృతదేహం లభ్యమయింది దీంతో విద్యార్థి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి తన కొడుకుకు ఈత రాదని తోటి విద్యార్థులే చంపి పడేశారని ఆరోపించారు పోలీసుల ముందు వాపోయారు ఫిర్యాదు చేశారు తోటి విద్యార్థులను అడుగుతుండగా ఎవరు నోరు విప్పడం లేదని ఉపాధ్యాయులు వారిని భయపెట్టి ఉన్నారని మృతుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు సంఘటన స్థలాన్ని సిఐ సుధాకర్ రెడ్డి పోలీసులు పరిశీలించారు మృతదేహాన్ని బయటికి వెళ్లి తీశారు.

About Author