NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెన్నూరు కొత్త రోడ్డులో యువకుని దారుణ హత్య

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: కడప కర్నూలు జాతీయ రహదారి కొత్త రోడ్డుపై సోమవారం రాత్రి 11:30 గంటలకు కాజీపేట మండలం చమ్మలపల్లె గ్రామపంచాయతీ లోని బాలానగర్ కుచెందిన ఈరి ప్రణయ్ కుమార్ వయస్సు (26)  దారుణ హత్య కు గురయ్యారు , పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, కాజీపేట మండలం చమ్మలపల్లి గ్రామపంచాయతీ లోని బాలానగర్ కు చెందిన ఈరి ప్రణయ్ కుమార్ తన స్నేహితులతో కలసి చెన్నూరులో మద్యం సేవించేందుకు రావడం జరిగింది, కాగాచెన్నూరు కొత్తగాంధీ నగర్ కు చెందిన పెయ్యల ప్రణయ్ అనే వ్యక్తి, మద్యం సేవించి ఇంటికి వెళ్లే సమయంలో ఈరి ప్రణయ్ కుమార్ కు ఇంతకుమునుపే తెలియడంతో పెయ్యల ప్రణయ్ ని పిలిచి తన స్నేహితుల తో పాటు మద్యం సేవించడం జరిగిందన్నారు, అయితే మద్యం మత్తులో వారిలో వారు గొడవ పడడంతో పేయల ప్రణయ్ ఈరి ప్రణయ్ ను కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని మిగిలిన స్నేహితులు పారిపోయారని తెలిపారు, మృతిచెందిన ప్రణయ్ ను పోస్ట్మార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించి, మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు తెలిపారు.

About Author