PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్, వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ ఉంటేనే మ‌ద్యం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌మిళ‌నాడు ప్రభుత్వం నూత‌న విధానాన్ని అమ‌లులోకి తెచ్చింది. మ‌ద్యం ప్రియుల‌కు ఆధార్, వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ ఉంటే మ‌ద్యాన్ని విక్రయించాల‌ని ఆదేశించింది. ఈ విధానం మొద‌టిసారిగా నీల‌గిరి జిల్లాలో అమ‌లుచేస్తున్నారు. క‌రోన నియంత్రణ చర్యల్లో భాగంగా ఆధార్, వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ ఉంటేనే మ‌ద్యం విక్రయించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. నీల‌గిరి జిల్లాలో 18 ఏళ్ల పైబ‌డిన వారు 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విధానంతో మందుబాబులు త‌ప్పనిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. నీల‌గిరి జిల్లాలో ఈ విధానం స‌క్సెస్ అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు చేసే ఆలోచ‌న‌లో ప్రభుత్వం ఉంది.

About Author