NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామ స‌చివాల‌యాల్లోనే.. ఆధార్, పాన్ కార్డ్ సేవ‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : గ్రామ స‌చివాల‌యాల్లో మ‌రిన్ని సేవ‌లు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఆధార్, పాన్ కార్డ్ సేవ‌లు గ్రామ స‌చివాల‌యాల్లోకి తీసుకొస్తున్నట్టు మంత్రులు బొత్స స‌త్యానారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. సచివాల‌యాల సేవ‌లు విస్తరించ‌డం, మ‌రిన్ని సేవ‌లు ప్రజ‌లకు అందుబాటులోకి తేవ‌డం పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రతి నెల శుక్ర, శ‌నివారాల్లో స‌చివాల‌య సిబ్బంది ప్రతి ఇంటిని సంద‌ర్శిస్తార‌ని తెలిపారు. ప్రభుత్వం ప‌థ‌కాలు అంద‌క‌పోతే.. అర్హుల‌కు సంక్షేమ ప‌థకాలు అందేలా స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లు చూస్తార‌ని మంత్రి బొత్స వెల్లడించారు. స‌చివాల‌యాల‌ను త‌ప్పనిస‌రిగా సంద‌ర్శించాల‌ని క‌లెక్టర్, స‌బ్ కలెక్టర్లకు ఇప్పటికే సీఎం జ‌గ‌న్ ఆదేశాలిచ్చార‌ని బొత్స తెలిపారు.

About Author