ఆధార్ – బేజార్….
1 min read– కౌతాళం లోని ఆధార్ కార్డు మార్పులకు ఎక్కడ వెళ్లవలసి ఉన్నది?!?
– ఆధార్ కార్డు మరియు డేట్ అఫ్ బర్త్ మరియు అడ్రస్ మార్చుకోవాలని వీలు కల్పించండి సారూ, మండల సిపిఐ ఈరన్న
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రమైన అయినటువంటి (3) సచివాలయాలు ఉన్నాయి, అసలు సమస్య ఒక్కో సర్టిఫికెట్ లో పేరు ఊరు, వేరు వేరుగా ఉండడంతో సమస్య తలనొప్పిగా మారింది. బ్యాంకు ఖాతాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలంటే ఆధార్లో మరోలా ఈ నేపథ్యంలో మండలంలో ఆధార్ సెంటర్ లేకపోవడం గమనార్హం! మండలంలో సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్స్ ఒకరు కూడా లేరు, గతంలో ఉన్నవారు బదిలీ వెళ్ళిపోయారు. నిత్యం మండల కేంద్రమైన 34 గ్రామాల్లో నుంచి పిల్లలు వృద్దులు వికలాంగులు ఒంటరి మహిళలు పింఛన్ కోసం ఆధార్ అప్డేట్ కోసం వస్తూ పోతూ ఉంటారు. ఆధార్ అప్డేట్ సమస్యలను సరి చేసుకోవడం కూడా, పేరు మార్చుకోవడానికి కౌతాళం నుంచి ఆదోనికి వెళ్ళవలసిన పరిస్థితి, ఈ విషయాన్ని, పై అధికారులు దృష్టి సారించి ఎంతైనా సమస్యని పరిష్కారం చూపాలని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న కోరారు.