పుట్టిన వెంటనే ఆధార్ కార్డు !
1 min read
పల్లెవెలుగువెబ్ : అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆధార్ జారీ చేసే ప్రక్రియ త్వరలో మొదలుకాబోతోంది. దీంతో ఆధార్ జారీ చేసే ప్రక్రియ మరింత సులువు కానుంది. ఇందుకోసం భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించింది. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఒక్క క్లిక్ తో ఫోటో తీసుకుని ఆధార్ జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నామని యూఐడీఏఐ అధికారులు తెలిపారు. ఐదేళ్ల వరకు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదని, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిది సరిపోతుందని తెలిపారు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటామని యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గార్గ్ తెలిపారు.