ఓటర్ జాబితాకు ఆధార్ లింక్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఓటరు జాబితాకు ఆధార్ కార్డును అనుసంధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీంతో దొంగ ఓటర్ల తరలింపులు, బలప్రదర్శనలకు ఇక చెక్ పడుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దొంగ ఓట్లు, నకిలీ నమోదు బెడదను తప్పించి.. ఎన్నికల ప్రక్రియను మరింత సమగ్రం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సర్వీస్ ఓటర్ల నమోదులో లింగ తటస్థతకు వీలుకల్పిస్తూ, ఏడాదికి ఒక్కసారే అవకాశమున్న ఓటరు నమోదు రిజిస్ర్టేషన్ ను నాలుగు సార్లకు పెంచుతూ మరో మూడు నోటిఫికేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి ఒకటి, ఏప్రిల్ ఒకటి, జూలై ఒకటి, అక్టోబరు ఒకటో తేదీల్లో.. ఏదో ఒకరోజున 18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువకులు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏడాదిలో జనవరి ఒకటో తేదీన మాత్రమే ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు.