NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆధార్ సంఖ్యను ఎప్పటికీ మార్చలేరు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వ్యక్తుల‌కు కేటాయించిన ఆధార్ నెంబ‌ర్ మార్చివేసి మ‌రో నెంబ‌ర్ కేటాయించ‌డం సాధ్యంకాద‌ని భార‌త విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటివి ఒక‌సారి అనుమ‌తిస్తే వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్లు మాదిరి ఫ్యాన్సీ నెంబ‌ర్ల కోసం క్యూ క‌డ‌తార‌ని స్పష్టం చేసింది. ఓ వ్యాపారి త‌న‌కు కేటాయించిన ఆధార్ నెంబ‌ర్ మార్చాల‌ని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. త‌న ఆధార్ గుర్తు తెలియ‌ని విదేశీ వ్యక్తుల‌కు అనుసంధాన‌మై ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని అన్నారు. ఈ పిటిష‌న్ ను జ‌స్టిస్ రేఖా ప‌ల్లి విచారించారు. ప్రతి ఆధార్ కార్డుదారు అందించిన స‌మాచారానికి భ‌ద్ర‌త ఉంటుంద‌ని ఉడాయ్ త‌ర‌పు న్యాయ‌వాదులు తెలిపారు.

About Author