NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ఆమ్ ఆద్మీ  పార్టీ ఇన్చార్జిగా ఆవుల చంద్రశేఖర్…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద జనవరి ఆమ్ ఆద్మీ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఆవుల చంద్రశేఖర్ ను నియమించినట్లు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాసిం నాయుడు అన్నారు. బుధవారం మండల కేంద్రం హోళగుంద నందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాసింనాయుడు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ ఆదేశాల మేరకు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న ఆవుల చంద్రశేఖర్ కు ఆలూరు నియోజకవర్గం శాసనసభ  అభ్యర్థిగా నియమించడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే ఆప్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ 2014, 2019 శాసనసభ ఎన్నికలలో ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేస్తారు. అదేవిధంగా ఈ ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టి సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఆలూరు నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన ఆవుల చంద్రశేఖర్ కు మాదాసి మా దారి కురువ సంఘం నాయకులు పెద్దహ్యట మల్లయ్య, ముద్దటమాగి గర్జప్ప తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్  పార్టీ నాయకులు అదిల్ ఖాన్, ఇస్రాయెల్, హనుమప్ప, షాషా, వీరారెడ్డి, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

About Author