NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్వాస ప‌రీక్ష‌లో ఆప్ విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీలో అర్వింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సర్కారు విశ్వాస పరీక్ష నెగ్గింది. గురువారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముగ్గురు మినహా అందుబాటులోని 59 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. కెనడాలో ఉండడంతో స్పీకర్‌ రాం నివాస్‌ గోయల్‌, ఆస్ట్రేలియా వెళ్లిన నరేష్‌ బల్యాన్‌, జైల్లో ఉన్న సత్యేందర్‌ జైన్‌ పాల్గొనలేదు. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌తో వాదనకు దిగిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి మార్షల్స్‌ బయటకు లాక్కెళ్లారు. దీనిని నిరసిస్తూ మిగిలిన ఐదుగురు బీజేపీ శాసన సభ్యులు వాకౌట్‌ చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ డబ్బుతో కొనుగోలు చేయలేదని, ఢిల్లీలో ‘ఆపరేషన్‌ లోటస్‌’ విఫలమైందని దేశానికి చాటేందుకే ఈ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు.

                                          

About Author