వృద్ధ్యాప్యంలో నిరాదారణకు గురవుతున్న తల్లిదండ్రులు
1 min read– తల్లిదండ్రుల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలి….-రాయలసీమ శకుంతల
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వృద్యాప్యంలో తల్లిదండ్రులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు,జాతీయ బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి,వైస్సార్సీపీ నాయకురాలు, నిరాశ్రయుల వసతిగృహ నిర్వాహకురాలు రాయలసీమ శకుంతల అన్నారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్బంగా సోమవారం కర్నూలు నగరంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయ వసతి గృహంలో వృద్ధ మహిళలను శకుంతల ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవతా దృక్పథంతో వృద్ధులను అదుకోవాలని,వారి పట్ల ప్రేమానురాగాలు ప్రదర్శించాలని ఆమె హితవు పలికారు. తల్లి పదిమందికి పిల్లలకు భోజనం పెడుతుందిగానీ 10 మంది పిల్లలు ఉన్న ఒక్క తల్లికీ భోజనం పెట్టడం లేదని ఆవేదన చెందారు.వయస్సులో ఉన్నపుడు తమ పిల్లలను ఎంత బాగా చూసుకుంటారో అలాగే పిల్లలు తమ తల్లి దండ్రులను వృధాప్యంలో కన్న బిడ్డల్లా చూసుకోవాలన్నారు. ఖార్జురా, బిక్కెట్లు, పళ్ళు పంపిణీ చేశారు.సమాజంలో యువతీ యువకులు జీవనం కోసం కొంతమంది వారికి వీలుకానందున ఆశ్రమాలలో పెడుతున్నారని కొంత మంది వారి పిల్లలు ఉపాధి లేక చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ఆశ్రమానికి వస్తున్నారన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తల్లితండ్రులను ఆశ్రమాలకు పంపుతున్నారని, అదే బాటలో వారి పిల్లలు కూడా తల్లిదండ్రులను ఆశ్రమాలలో వదిలితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నిరాశ్రయులు కేర్ టేకర్ లతా శ్రీ పాల్గొన్నారు.